ఎన్‌టీఆర్‌-ప్ర‌శాంత్ నీల్ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!

  • వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల
  • మే 20న తారక్ పుట్టినరోజున మూవీ గ్లింప్స్ రిలీజ్
  • ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం
యంగ్ టైగర్ ఎన్టీఆర్, 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రంపై కీలక అప్‌డేట్ వచ్చింది. 'ఎన్టీఆర్ 31'గా వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది పండగలాంటి వార్త.

వచ్చే ఏడాది జూన్ 11న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు హీరో ఎన్టీఆర్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా షాడో లుక్‌తో ఉన్న ఓ ఆసక్తికర పోస్టర్‌ను కూడా పంచుకున్నారు. అంతేకాకుండా మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా సినిమా గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో అభిమానుల ఆనందం రెట్టింపైంది.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలకు బ్లాక్‌బస్టర్ సంగీతం అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకు కూడా స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

NTR-Neel
NTR 31
Prashanth Neel
NTR Arts
Mythri Movie Makers
Telugu cinema
Tollywood
Release date
Ravi Basrur
Dragon movie

More Telugu News